TG: రాష్ట్రంలో నిర్వహిస్తున్న TGPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి పరీక్షకు హాజరైంది. ఈ క్రమంలో ఆమె మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా.. ఇన్విజిలేటర్ గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె OMR షీట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.