AP: తల్లి, చెల్లెలుపై జగన్కు అపారమైన ప్రేమ ఉందని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు రావాల్సిన ఆస్తులను జగన్ ఎప్పుడో ఇచ్చేశారని పేర్కొన్నారు. జగన్కు బెయిల్ రద్దు చేయాలని తెరచాటున కుట్ర జరుగుతుందని తెలిపారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో షర్మిల ఆ కుట్రలో భాగం కావద్దని ఎస్వీ వ్యాఖ్యానించారు.