బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి ఊరట లభించింది. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిపై ఉన్న లుక్ అవుట్ సర్క్యూలర్‌ను రద్దు చేస్తూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మహారాష్ట్ర సర్కారు, CBI, ఇమ్మిగ్రేషన్ బ్యూరో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.