AP: ప్రమాదం జరిగిందని ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు వాహనంలో గంజాయి లభ్యమైంది. ఒడిశా నుంచి పలాస వెళ్తున్న బొలెరో వాహనం బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి గాయపడటంతో బొలెరో డ్రైవర్ పారిపోయాడు. ప్రమాద స్థలానికి వెళ్లిన పోలీసులు.. బొలెరో వాహనంలో తరలిస్తున్న 600కేజీల గంజాయిని సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.