దీపావళి పండుగ సందర్భంగా బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పాట్నాతో పాటు గయా, ముజఫర్పూర్, హాజీపూర్లలో అన్ని రకాల టపాసుల అమ్మకం, వాడకాన్ని నిషేధించడం జరిగింది. దీపావళి సందర్భంగా అన్ని నగరాల్లో గాలి నాణ్యతను కాపాడాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.