AP: విజయవాడ బందర్ రోడ్డులోని APPSC కార్యాలయంలో ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారిణి ఏఆర్ అనురాధ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఏపీపీఎస్సీ కార్యదర్శి జే ప్రదీప్ కుమార్ ఆమెతో పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అనురాధకు బోర్డు సభ్యులు, కార్యదర్శి, అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.