VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణం పుణ్యక్షేత్రంలో గురువారం పునర్వసు నక్షత్రం సందర్బంగా శ్రీ సీతారాముల వారికి శాంతి కళ్యాణం పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నీరజా శ్రీనివాస్ పాల్గొన్నారు.