TG: MLAల పార్టీ ఫిరాయింపుల కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌లో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో వాదనలు వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ గడువు కోరింది. దీంతో ఈ కేసును కోర్టు నవంబర్ 4కు వాయిదా వేసింది. తమ పార్టీలో గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లోకి వెళ్లారని.. అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని BRS పిటిషన్ వేసింది.