పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు అశ్విన్ తన తొలి ఓవర్లోనే లాథమ్‌ను ఔట్ చేశాడు. వీరిద్దరు 11 ఇన్నింగ్స్‌ల్లో తలపడగా.. లాథమ్‌ను అశ్విన్ 9 సార్లు ఔట్ చేయడం విశేషం. విల్ యంగ్ వికెట్‌ను అశ్విన్ రివ్యూలో దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్లో అత్యధిక వికెట్లు సాధించిన ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.