BPT: కారంచేడు మండలంలోని స్వర్ణ గ్రామంలోని స్వర్ణమ్మ తల్లి ఆలయంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు హుండీ తాళాలను పగలగొట్టి సొమ్ము దొంగలించుకెళ్లారు. పూజారులు ఉదయం ఆలయానికి వచ్చేసరికి ఆలయం ప్రధాన హుండి తాళాలు లేకుండా తెరిచి ఉంది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు పిర్యాదు చేయగా ఎస్సై పి.వెంకట్రావు, పోలీస్ సిబ్బంది ఆలయాన్ని పరిశీలిస్తున్నారు.