SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో గురువారం సీపీఎం శాఖ ఆధ్వర్యంలో పి కవిలేశ్వర్రావు అధ్యక్షతన మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. నారాయణపురం భూములను సాగు చేస్తున్న రైతులకు సాగు హక్కు కల్పించాలని, విద్యుత్ ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యులు తేజేశ్వరరావు డిమాండ్ చేశారు.