పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్‌కు అశ్విన్ షాక్ ఇచ్చాడు. తన మొదటి ఓవర్లోనే కెప్టెన్ టామ్ లాథమ్‌ను(15) పెవిలియన్ చేర్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 36/1 పరుగులు చేసింది. ప్రస్తుతం కాన్వే(20), యంగ్(1) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.