దానా తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా నడిచే దాదాపు 200 రైళ్లను రైల్వేశాఖ క్యాన్సిల్ చేసింది. అలాగే, కోల్కతా ఎయిర్ పోర్టు ఇవాళ సాయంత్రం 6 నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు భువనేశ్వర్ విమానాశ్రయం ఇవాళ సాయంత్రం 5 నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తుపాను ఒడిశాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.