ఇరాక్, సిరియాలో టర్కీ దాడులు జరిపింది. టర్కీలోని అంకారా శివారులో ఉన్న ఏరోస్పేస్ సంస్థపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఈ దాడులు చేసింది. ఇరాక్, సిరియాలోని కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు టర్కీ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఒక్కరు కూడా మిగలకుండా ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టేస్తామని పేర్కొంది.