TG: టూరిజం శాఖ పర్యాటకులకు గుడ్న్యూస్ చెప్పింది. ఈనెల 26 నుంచి శ్రీశైలం డ్యామ్ బ్యాక్వాటర్లో టూర్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కొల్లాపూర్లోని సోమశిల టు శ్రీశైలం వరకు సింగిల్ రైడ్తోపాటు రౌండప్ క్రూయిజ్ జర్నీ ధరలను ప్రకటించారు. సింగిల్ జర్నీ పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600, రౌండప్ జర్నీలో పెద్దలకు రూ.3 వేలు, పిల్లలకు రూ.2,400గా నిర్ణయించారు.