AP: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆయన.. ‘ఉక్కు పరిశ్రమ కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించటంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. ప్రభుత్వంపై వంద రోజుల్లోనే వ్యతిరేకత వచ్చింది. దస్పల్లా భూములతో నాకు సంబంధం లేదు’ అని పేర్కొన్నారు.