ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకొని ఢిల్లీకి పయనమయ్యారు. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ఆయన.. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సహా పలువురు దేశాధినేతలతో చర్చలు జరిపారు. ఉజ్బెకిస్థాన్, యూఏఈ అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు. మోదీ రష్యా పర్యటన విజయవంతంగా కొనసాగిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.