AP: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యం కోసం కర్నూలు నుంచి తిరుపతి వెళ్తుండగా కారు- ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.