AP: వైసీపీ హయాంలో అత్యాచారాలు, హత్యలు జరిగితే జగన్ ఎందుకు స్పందించలేదని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. తాడేపల్లిలోని జగన్ ఇంటి సమీపంలో అత్యాచారం జరిగితే కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఒంటరి మహిళలపై వాలంటీర్లు దాడులు, అఘాయిత్యాలకు పాల్పడ్డారని, బాధితుల కుంటుంబాలను జగన్ పరామర్శించలేదని పేర్కొన్నారు. జగన్ డ్రగ్స్‌ను ప్రోత్సహించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.