AP: మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ ‘ X’ వేదికగా ఫైర్ అయ్యారు. ‘నాతో చర్చకు సిద్దామా’ అంటూ జగన్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా గౌరవప్రదంగా ఉంటుందన్నారు. ‘దిశ’ చట్టం ఒక అబద్దమని, ఆ చట్టం పేరిట ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో పోలీసులు పని చేయడం లేదనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.