ELR: ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ గురువారం జిల్లాలో పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయ వర్గ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10:30 గంటలకు ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రి రివ్యూ మీటింగ్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు పెదపాడు మండలం వేంపాడు గ్రామంలో అనంతరం 2:30 గంటలకు బుట్టాయిగూడెం మండలం ఈఎంఆర్ఎస్ పాఠశాలను సందర్శిస్తారు.