TG: బీసీ సమస్యలు పరిష్కరించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఈనెల 26న పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. భారతీయ బీసీ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో 13 బీసీ సంఘాలు, 30 ఉపసంఘాల నాయకులతో కలిసి ఆర్ కృష్ణయ్య సమావేశమయ్యారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, జనగణనలో కులగణన కూడా చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు పాస్ చేయించాలని తెలిపారు.