VZM: తుఫాను ప్రభావం వల్ల రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. తుఫాను ఎదుర్కొనేందుకు క్షేత్ర స్థాయిలో సన్నద్ధత పై ఆరా తీశారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే 24, 25వ తేదీల్లో ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.