E.G: పార్టీ అభివృద్ధి కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు టీడీపీలో తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే శిరీషదేవి అన్నారు. చింతూరులో టీడీపీ నాయకులతో, కార్య కర్తలతో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ సభ్యత్వాల నమోదులో చురుకుగా పాల్గొనాలని, మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. టీడీపీ యువ నేత భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.