మన్యం: పాలకొండ నగర పంచాయతీ పరిధి దేవాంగ వీధిలో గౌరీ దేవి, నందెన్న మహోత్సవాలు 7 రోజులు పాటు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం తిరువీధి మహోత్సవం హిందూ సాంప్రదాయ పద్ధతిలో మేళ తాళాలతో నిర్వహించినట్లు దేవాంగ కుల పెద్దలు ఒక ప్రకటనలో తెలిపారు. లుంబురు రోడ్డులో గల కృష్ణ చెరువులో నిమజ్జన మహోత్సవం కోసం చేపట్టిన తిరువీధి మహోత్సవంలో స్థానికులు పాల్గొన్నారు.