AP: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ మేరకు కొరియన్ ఎక్జిమ్ బ్యాంక్ ఈడీసీఎఫ్ ప్రతినిధులు మంత్రి లోకేష్‌తో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల మంజూరు కోసం ఈడీబీని పునరుద్ధరించామని లోకేష్ వెల్లడించారు.