VZM: జిల్లా ఎస్పీ ఆదేశాలతో డెంకాడ పోలీస్ స్టేషన్ పరిది నాతవలస గ్రామంలో సంకల్పం పేరుతో గ్రామస్తులకు మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, అక్రమ బాణాసంచా నిల్వలపై బుధవారం ఎస్సై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు చిత్తు అవుతాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి, పోలీసులకు సహకరించాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడోద్దోన్నారు.