టర్కీలో ముంబై తరహా ఉగ్రదాడి జరిగింది. అంకారాలోని ఏవియేషన్ కంపెనీలో ఉగ్రవాదులు చొరబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో 10 మంది మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. అలాగే, పలువురిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.