VZM: పారిశుధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఎ జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లిమర్ల నగరపంచాయతీ కమిషనర్ కె.అప్పలనాయుడుకు బుధవారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు రావాల్సిన ఎరియర్స్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.