ADB: ఇచ్చొడ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ కోఆప్షన్ మెంబర్ మహిమూద్ చిన్నమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ బాధిత కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.