SKLM: పలాస మండలం కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డులో గల దత్తాత్రేయ నగర్లో ప్రధాన రహదారులకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ పనులు బుధవారం నిర్వహించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషకు ఇచ్చిన వినతి మేరకు సంబంధిత అధికారులు ఈ పనులు చేపట్టారని దత్తాత్రేయ నగర్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సవర జగన్నాయకులు తదితరులు తెలిపారు.