కివీస్‌తో జరిగే రెండో టెస్ట్‌లో మహ్మద్ సిరాజ్‌ను తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి టెస్ట్‌లో అతడు కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. అంతే కాకుండా స్వదేశంలో ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో కేవలం 19 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. సొంతగడ్డపై అంతగా రాణించకపోవడంతో అతని పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. సిరాజ్‌ను తప్పిస్తే అతని స్థానంలో ఆకాశ్ దీప్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారు.