‘దానా’ తుపాను ప్రభావంతో ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనేది ఇంకా వెల్లడించలేదు. వారం రోజుల్లో కొత్త తేదీని ఖరారు చేస్తామని పేర్కొంది. అయితే, ఈనెల 27న పరీక్ష జరగాల్సి ఉంది. అలాగే, రాష్ట్రంలోని నందన్‌కానన్ జూ, బొటానికల్ గార్డెన్లను 24, 25 తేదీల్లో మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.