TG: KTR స్టేట్మెంట్ను నాంపల్లి కోర్టు రికార్డు చేసింది. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా మంత్రి తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యానించారని KTR కోర్టుకు వెల్లడించారు. డ్రగ్ అడిక్ట్ అని, రేవ్పార్టీలు నిర్వహిస్తానని అన్నారని తెలిపారు. సాక్షులు తనకు 18 ఏళ్లుగా తెలుసని, వాళ్లు టీవీలో చూసి ఫోన్ చేసి చెప్పారని పేర్కొన్నారు. తనతో పాటు BRS పార్టీకి నష్టం కలిగించేందుకు సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు.