SKLM: ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. మంగళవారం నరసన్నపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతున్నాయని వీటి పట్ల ప్రజలు అవగాహన తెచ్చుకోవాలని ఆయన సూచించారు.