క్రిష్ణా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన సందర్భంగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆయనకు ట్విటర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రతను పెంపొందించడంలో అమిత్ షా నాయకత్వ పటిమ అత్యంత కీలకమైనదని సుజనా పేర్కొన్నారు. కీలకమైన సవాళ్లను ఎదుర్కోవడంలో అమిత్ షా అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని సుజనా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.