కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగటంతో పసిడితో పాటు వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ.80,340కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,800గా ఉంది. కిలో వెండిపై ఏకంగా రూ.2000 పెరగటంతో రూ.1,09,100 ఉంది.