నెల్లూరు: తడ గ్రామంలోని బీసీ కాలనీలో గౌతమ్ రాజుకు చెందిన R15 బైకును గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. మంటలను చూసి చుట్టుపక్కల వారు కేకలు పెట్టడంతో గౌతమ్ రాజు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మంటలను ఆర్పారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.