AP: విజయవాడలో అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ప్రారంభమైంది. మంగళగిరిలోని CK కన్వెన్షన్లో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2 రోజులపాటు జాతీయ స్థాయిలో జరగనున్న ఈ సదస్సులో 9 ప్యానల్ డిస్కషన్లు, 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాలసీ పత్రం ఆవిష్కరణ కార్యక్రమాలుంటాయి. డ్రోన్ల రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ఈ కార్యక్రమం తొలి అడుగు కానుందని ప్రభుత్వం భావిస్తోంది.