పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్టులో టీమిండియా జట్టులో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్ట్‌లో KL రాహుల్ రాణించకపోవడంతో రెండో టెస్ట్‌లో అతడిపై వేటు పడే అవకాశముంది. ఒకవేళ అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకుంటే రాహుల్‌తో పాటు కుల్దీప్పై కూడా వేటు పడనుంది. మరోవైపు గాయం కారణంగా పంత్‌కు విశ్రాంతి కల్పించాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.