12th ఫెయిల్ మూవీ హీరో విక్రాంత్ మాస్సే తన భార్య, నటి షీతల్ కాళ్లు మొక్కిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరాదిన భర్తలు ఆయురారోగ్యాలతో ఉండాలని భార్యలు కార్వాచౌత్ ఆచారాన్ని పాటిస్తారు. ఈ నేపథ్యంలో విక్రాంత్ భార్య షీతల్ ఆయన ముఖాన్ని జల్లెడలో చూసింది. అనంతరం విక్రాంత్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంది. వెంటనే విక్రాంత్ కూడా షీతల్ కాళ్లు మొక్కాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.