AP: రాష్ట్రంలోని రౌడీలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే ఊరుకోమని సీఎం పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం కక్ష సాధింపులే పనిగా పెట్టుకుంది. గతంలో వేధింపులకు పోలీసులను వాడుకున్నారు. ఐపీఎస్ లను రాజకీయాలకు వాడుకున్నారు. మాజీ సీఎం ఇంటి కంచె కోసం రూ.12 కోట్ల ఖర్చు చేశారు. రాళ్ల పేరుతొ రూ.700 కోట్లు వృథా చేశారు. కానీ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేసేందుకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు’ అని అన్నారు.