మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో ఇండియన్ UPIని ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. UPIని మొదలుపెట్టేందుకు ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, ఈ ఏడాది ఆగస్టులో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాల్దీవుల పర్యటన సందర్భంగా UPIకి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు.