GNTR: ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారు కత్తులు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురుకి గాయాలయ్యాయి. పాత కక్ష్యల నేపథ్యంలో ఘర్షణ జరిగిందని పోలిసులు భావించారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.