రష్యాలోని పశ్చిమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడి చేసింది. వీటిలో 100కుపైగా డ్రోన్లను తమ సైన్యం కూల్చేసినట్లు రష్యా వెల్లడించింది. రష్యాలోని జెర్జిన్స్క్ ప్రాంతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వేర్దలోవ్ కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. ఆ ప్రాంతంలో బాంబులకు అవసరమైన రసాయనాలు వంటి వాటిని తయారుచేస్తున్నట్లు ఆరోపించింది.