BDK: ఇటీవల సింగరేణిలో విడుదలైన ఉద్యోగ ఫలితాలలో అర్హత చాటిన అభ్యర్థులకు ఈనెల 24 నుంచి 29 వరకు సర్టిఫికెట్ పరిశీలన నిర్వహిస్తున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఆదివారం తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు మూడు సెట్ల జిరాక్స్ కాపీలతో వారికి కేటాయించిన తేదీలలో హాజరుకావాలని కోరారు.