తూ.గో: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోమవారం అల్లవరం మండలంలో పర్యటించనున్నట్లు పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటల నుంచి బోడసకుర్రు, ఎంట్రుకోన, రెల్లుగడ్డ, తూర్పులంక, గుండెపూడి, దేవగుప్తం, డి.రావులపాలెం, సామంతకుర్రు గ్రామాల్లో జరిగే పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.