NRML: ఆలయాలపై దాడులు,దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ అన్నారు. బైంసా పట్టణంలోని నరసింహస్వామి ఆలయంలో జరిగిన దొంగతనం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన వైఫల్యం మూలంగా హిందు ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం నిత్యకృత్యంగా మారిపోయాయని మండిపడ్డారు.