KNR: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో 29 వెంటనే రద్దు చేయాలని, జీవో 55 అమలు చేయాలని హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం గ్రూప్ -1 సంబంధించిన అంశంపై ఆయన స్పందించారు. విద్యార్థుల అండతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వారిపై కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు.