W.G: పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామాలలో గ్రామ సభను తహశీల్దార్ విజయలక్ష్మి శనివారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతంలో జరిగిన రీసర్వేలలో తప్పులను సరిదిద్దుకునేందుకు ఈ గ్రామసభలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆమె రైతులు, భూ యజమానులు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు.